ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళలోను అదరగొట్టేసిన '24'

Fri, Jun 10, 2016
'24'లో సూర్య - సమంతా
'24'లో సూర్య - సమంతా
సూర్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో '24' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ఆనూహ్యమైన ఆదరణ లభించింది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. ఇక కేరళ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో అలరించింది.

కేరళలో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ చిత్రాల్లో 'ఐ' మొదటి స్థానంలో కనిపిస్తుంది. ఈ సినిమా అక్కడ 20 కోట్లను సాధించింది. ఆ తరువాత స్థానంలో విజయ్ నటించిన 'తెరి' చిత్రం నిలిచింది. ఈ సినిమా అక్కడ 16 కోట్లను రాబట్టింది. అంతకుముందు విజయ్ చేసిన కత్తి .. తుపాకి చిత్రాలు అక్కడ 10 కోట్లను వసూలు చేశాయి. తాజాగా సూర్య '24' మూవీ ద్వారా అక్కడ 10 కోట్లను వసూలు చేసి, ఈ జాబితాలో చేరిపోయాడు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)