ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరోసారి చైతూ జోడీగా సమంతా!

Fri, Jun 10, 2016
సమంతా
సమంతా
తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలతో .. వరుస విజయాలతో సమంతా దూసుకుపోతోంది. తాజాగా 'అ ఆ' సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్న సమంతా, మరో భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది .. అదీ నాగచైతన్య జోడీగా కావడమే విశేషం. గతంలో నాగచైతన్యతో కలిసి ఆమె ఏ మాయ చేశావే .. ఆటోనగర్ సూర్య .. మనం సినిమాలు చేసింది. తెరపై ఈ జంటకి మంచి మార్కులు పడ్డాయి.

అందువల్లనే మరోమారు ఆడియన్స్ ను అలరించడానికి ఈ జంట రెడీ అవుతోందని తెలుస్తోంది. నాగార్జునకి 'సోగ్గాడే చిన్నినాయన' వంటి సూపర్ హిట్ ను ఇచ్చిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, చైతూ నటించనున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా సమంతాను ఫైనల్ చేశారట. నాల్గొవసారి ఈ జంట జోడీకట్టడం హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)