ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హను రాఘవపూడితోనే అఖిల్?

Fri, Jun 10, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఆ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలు చాలా రోజులుగా అక్కినేని అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వంశీ పైడిపల్లికి లభించిందని చెప్పుకున్నారు. కథపై ఆయన కసరత్తు చేస్తున్నాడని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నాడనే టాక్ వచ్చింది.

ఆ తరువాత కొరటాల శివ .. హను రాఘవపూడి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, హను రాఘవపూడితో చేయడానికే అఖిల్ రెడీ అవుతున్నాడట. 'అందాల రాక్షసి' .. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'లో ఆయన చూపిన కొత్తదనం అఖిల్ కి బాగా నచ్చిందట. ఓ వారం రోజుల్లో హను రాఘవపూడితో అఖిల్ ఫైనల్ సిటింగ్ ఉంటుందనీ, దాంతో అఖిల్ ఒక నిర్ణయానికి వస్తాడని అంటున్నారు. ఆ తరువాతనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన చేయాలని అనుకుంటున్నారట.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)