ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ రెడీ అవుతున్నాడు

Fri, Jun 10, 2016
రవితేజ
రవితేజ
'బెంగాల్ టైగర్' తో సందడి చేసిన రవితేజ, ఆ తరువాత అదే దూకుడును కంటిన్యూ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఒక సినిమా ఆగిపోవడమే కాకుండా, ప్రస్తుతం చేస్తున్న 'రాబిన్ హుడ్' సినిమా విషయంలోను కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ఈ కథ విషయంలో కసరత్తు ఎక్కువగా చేయడం వల్లనే ఆలస్యమైందని చెబుతున్నారు.

ఈ సినిమా ద్వారా చక్రి అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. జూలై నెలలో సెట్స్ పైకి వెళ్లే ఆలోచనతో ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయికగా నటించనుంది. ఈ సినిమా కథపై రవితేజ బలమైన నమ్మకంతో ఉన్నాడట. మరి ఆయన ఆశించే హిట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)