ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Jun 10, 2016
తమన్నా
తమన్నా
* మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. 'బాహుబలి 2' చిత్రంలో ఈ ముద్దుగుమ్మకు యాక్షన్ సీన్స్ వున్నాయట. దీని గురించి ఈ చిన్నది చెబుతూ, 'ఇందులో గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ ఫైట్స్ చేయాలి. అందుకని ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నాను' అని చెప్పింది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న స్టంట్ కళాకారుడు జిత్తు వర్మ పర్యవేక్షణలో తమన్నా ప్రస్తుతం హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.
* నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అ ఆ' చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నైజాం ప్రాంతంలో ఈ చిత్రం మొదటి వారం 9 కోట్ల 28 లక్షల షేర్ సాధించినట్టు చెబుతున్నారు. లాంగ్ రన్ లో ఈ ప్రాంతంలో 15 కోట్ల వరకు ఇది వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. మూడు రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసిన తర్వాత నానక్ రామ్ గూడకు యూనిట్ షిఫ్ట్ అయింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.
* ధనుష్, జెనీలియా జంటగా గతంలో నటించిన 'ఉత్తమ పుత్తిరన్' తమిళ చిత్రాన్ని 'నారదుడు' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. విశేషం ఏమిటంటే రామ్ హీరోగా శ్రీను వైట్ల తీసిన 'రెడీ' చిత్రానికి ఇది తమిళ రీమేక్!
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)