ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

50 కొట్టేసిన 'సరైనోడు'

Thu, Jun 09, 2016
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' .. రేపటితో 115 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకోనున్నాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకుని 100 రోజుల దిశగా పరుగులు తీస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బోయపాటి .. బన్నీల కృషి ఫలించిందని చెప్పారు. బన్నీ నటన పరంగా పరిణితిని కనబరిచాడని ఎంతోమంది అన్నారనీ, ఈ స్థాయికి చేరుకోవడానికి బన్నీ ఎంతో కృషి చేశాడని అన్నారు. అలాగే బోయపాటి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసుకుని కష్టపడటం వలన ఈ స్థాయి విజయం లభించిందని చెప్పారు. ఇక రకుల్ .. కేథరిన్ ఇద్దరూ కూడా పోటీపడి నటించారని అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారనీ .. వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)