ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ధ్రువ' షూటింగులో రకుల్

Thu, Jun 09, 2016
రకుల్
రకుల్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, నాలుగు రోజుల క్రితమే తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టింది. హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ షెడ్యూల్లో చరణ్ కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఈ రోజున ఈ సినిమా షూటింగులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రకుల్ స్వయంగా తెలియజేసింది. 'ధ్రువ' షూటింగులో పాల్గొనడం కొత్త ఆనందాన్ని ఇస్తోందని చెప్పింది. ఇక చరణ్ .. రకుల్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చరణ్ తో రకుల్ చేసిన 'బ్రూస్ లీ' పరాజయం పాలైనా, ఈ సినిమాలో ఆమెకి ఛాన్స్ దొరకడం విశేషం. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, నవదీప్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడనే సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)