ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ప్రేమమ్'లో గెస్టుగా చేసిన వెంకటేశ్!

Thu, Jun 09, 2016
వెంకటేశ్
వెంకటేశ్
టాలీవుడ్ అగ్రకథానాయకులలో వెంకటేశ్ ఒకరు. కథల విషయంలోను .. పాత్రల విషయంలోను వెంకటేశ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందువల్లనే ఆయన కెరియర్లో సక్సెస్ లు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి వెంకటేశ్ అతిథి పాత్రల వైపు ఎప్పుడూ మొగ్గుచూపలేదు. అయితే తన మేనల్లుడైన నాగచైతన్య కోసం ఆయన ఒక గెస్టు పాత్రకి అంగీకరించక తప్పలేదు.

నాగచైతన్య కథానాయకుడిగా 'ప్రేమమ్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్యతో అనుబంధాన్ని కలిగిన ఒక కీలకమైన పాత్ర వుందట. ఆ పాత్రను వెంకటేశ్ చేసే అవకాశం వుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, వెంకటేశ్ .. నాగచైతన్య కాంబినేషన్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందట. ఇక తెరపై ఈ ఇద్దరూ కలిసి చేసే సందడి ఏ స్థాయిలో వుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)