ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ పారితోషికం 23 కోట్లా?

Thu, Jun 09, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
ఇటీవల మహేశ్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ ప్రభావం ఆయన తదుపరి సినిమాపై పడుతుందనీ, ఆయన పారితోషికం తగ్గే అవకాశం వుందని కొంతమంది చెప్పుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదనీ, ఒకటి రెండు సినిమాలు ఆడకపోవడం వలన ఆయనది వెంటనే తగ్గిపోయే క్రేజ్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక వాస్తవమెంతో తెలియదుగానీ, మురుగదాస్ సినిమాకి ఆయన 23 కోట్లు పారితోషికంగా తీసుకోనున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనున్న కారణంగానే ఆయన ఈ స్థాయి పారితోషికం తీసుకోనున్నాడని అంటున్నారు. 85 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబడుతోన్న కారణంగా, టెక్నికల్ హెడ్స్ తో మురుగదాస్ మీటింగ్ ను పూర్తిచేశాడట. ఈ సినిమా గురించిన పూర్తి అవగాహన టీమ్ లోని వారందరికీ కలిగేలా చూసుకున్నాడట. ఇక జూలై 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)