ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విభిన్నమైన పాత్రలపై అనుపమ ఆసక్తి

Thu, Jun 09, 2016
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
'అ ఆ' సినిమాలో అనుపమ పరమేశ్వరన్ రెండవ కథానాయికగా నటించింది. మలయాళం లో 'ప్రేమమ్'తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మాయి, అదే పేరుతో రూపొందుతోన్న తెలుగు సినిమాలోనూ అదే పాత్రను పోషిస్తోంది. అయితే ఆ సినిమాకన్నా ముందుగా 'అ ఆ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఆమె గడుసు అమ్మాయిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. తన పాత్ర ఇంతబాగా రావడానికి .. ఆడియన్స్ నుంచి ఆదరణ పొందడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ అని ఆమె చెప్పింది. ఈ పాత్ర తనకి ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చిందని అంది. ఇకపై కూడా తెలుగు సినిమాలు చేయాలని ఉందనీ, అయితే అందుకు తగిన విభిన్నమైన పాత్రలు రావలసి వుందని చెప్పింది. 'అ ఆ' తోనే అందరి దృష్టిని ఆకర్షించిన అనుపమకి, 'ప్రేమమ్' సినిమా తరువాత మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)