ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ తో పాటకు పరిణీతి రెడీ!

Thu, Jun 09, 2016
పరిణీతి
పరిణీతి
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా దక్షిణాదిలో నటించే తొలిచిత్రం కన్ఫర్మ్ అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఆమె కథానాయికగా నటించడానికి ఓకే చెప్పింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ ఓ భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో నిర్మించే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం పలువురిని పరిశీలించిన మీదట చివరికి పరిణీతి చోప్రాను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. జూలై 15 నుంచి ఈ చిత్రం షూటింగును హీరో హీరోయిన్లపై ఓ పాట చిత్రీకరణతో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో భారీ సెట్స్ రూపకల్పన జరుగుతోంది. పలు ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ చిత్రం మహేశ్ బాబు ఇమేజ్ ను మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)