ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jun 09, 2016
సమంతా
సమంతా
* తాజాగా 'అ ఆ' సినిమాతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకున్న చెన్నయ్ బ్యూటీ సమంతా ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలసి స్టెప్పులేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా కోసం వీరిద్దరిపై ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
* అల్లు శిరీష్ కథానాయకుడుగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తోంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
* నాని నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం మెదక్ పరిసరాల్లో జరుగుతోంది. 'ఉయ్యాల జంపాల' ఫేం విరించివర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ అధినేత జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)