ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అతిథి పాత్రలో అందాల కాజల్!

Wed, Jun 08, 2016
కాజల్
కాజల్
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన దగ్గర నుంచి, కాజల్ ఆ స్టేటస్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన మాత్రమే ఆమె నటిస్తోంది. అందువలన ఆమెను అతిథి పాత్రకి అడిగే సాహసాన్ని ఎవరూ చేయలేదు. కానీ కృష్ణవంశీ మాత్రం ఈ విషయంలో ఆమెను ఒప్పించాడు.

ప్రస్తుతం ఆయన సందీప్ కిషన్ .. రెజీనా జంటగా 'నక్షత్రం' సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో వున్నాడు. ఇందులో గెస్ట్ పాత్రకిగాను ఆయన కాజల్ ను సంప్రదించాడు. 15 రోజుల కాల్షీట్ ను కూడా తీసుకున్నాడట. 'చందమామ' సినిమా ద్వారా తనకి ఈ స్థాయి స్టార్ డమ్ ను తీసుకువచ్చింది ఆయనే కనుక, ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. గెస్టు పాత్రనే అయినా పారితోషికం మాత్రం పెద్ద మొత్తంలోనే తీసుకుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)