ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కండక్టర్ గా మెప్పిస్తానంటోన్న హీరో!

Wed, Jun 08, 2016
'రైట్ రైట్'లో సుమంత్ అశ్విన్
'రైట్ రైట్'లో సుమంత్ అశ్విన్
ప్రత్యేకమైన గుర్తింపు కోసం కృషి చేస్తోన్న యువకథానాయకుల్లో సుమంత్ అశ్విన్ ఒకరుగా కనిపిస్తాడు. తూనీగా తూనీగా .. కేరింత వంటి చిత్రాల ద్వారా ఆయన యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అలాంటి సుమంత్ ఈ నెల 10వ తేదీన 'రైట్ రైట్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను పోషించిన కండక్టర్ పాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు.

ఈ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుందని అన్నాడు. అరకు సమీపంలో గల 'గవిటి' అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనీ, అనూహ్యమైన మలుపులతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుందని చెప్పాడు. వంశీకృష్ణ నిర్మాణంలో దర్శకుడు మను ఈ సినిమాను చాలా చక్కగా ఆవిష్కరించాడని అన్నాడు. పూజా జవేరి కథానాయికగా నటించిన ఈ సినిమా, మలయాళంలోని 'ఆర్డినరీ' అనే సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)