ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆనందంతో పొంగిపోతోన్న శ్రుతిహాసన్

Tue, Jun 07, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
అందాల కథానాయిక శ్రుతిహాసన్ ఇప్పుడు 'శభాష్ నాయుడు' సినిమా షూటింగుతో బిజీగా వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. కమలహాసన్ .. శ్రుతిహాసన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కమల్ కి కూతురు పాత్రను పోషిస్తోంది. తన తండ్రితో కలిసి నటించే క్షణాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ మధ్య చెప్పిన శ్రుతి, ఇప్పుడు ఆ సంతోషాన్ని పొందుతోంది.

తన తండ్రితో కలిసి నటించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని అంటోంది. తొలి రోజున షూటింగులో తాను పొందిన అనుభూతి అంతా ఇంతా కాదని చెబుతోంది. టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కమల్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మానందం నటిస్తోన్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)