ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లరి నరేష్ జోడీగా కృతిక!

Tue, Jun 07, 2016
కృతిక జయకుమార్
కృతిక జయకుమార్
ఈ మధ్య కాలంలో నరేష్ అల్లరి కాస్తంత తగ్గిందనే చెప్పాలి. ఆయన నటించిన సినిమాలు థియేటర్ల దగ్గర పెద్దగా సందడి చేసింది లేదు. కథల విషయంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్నాడేమో, కాస్త స్పీడు తగ్గించాడు. అలా ఆచి తూచి మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'మా ఇంట్లో వుంది దెయ్యం నా కెందుకు భయం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇక ఈ సినిమాలో నరేష్ సరసన కథానాయికగా కొంతమందిని పరిశీలించి, చివరికి కృతిక జయకుమార్ ను ఎంపిక చేసుకున్నారు. 'దృశ్యం' సినిమాలో వెంకటేశ్ పెద్ద కూతురుగా నటించిన కృతిక, ఈ సినిమా ద్వారా కథానాయికగా అలరించనుంది. ఇంతవరకూ భారీ సినిమాలను నిర్మిస్తూ వచ్చిన బీవీఎస్ ఎన్ ప్రసాద్, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)