ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని మూవీలో హైలైట్ గా క్లైమాక్స్!

Tue, Jun 07, 2016
'జంటిల్ మన్' లో సురభి - నాని
'జంటిల్ మన్' లో సురభి - నాని
సాధారణంగా ప్రతి సినిమాకి కూడా క్లైమాక్స్ ప్రాణంగా వుంటుంది. క్లైమాక్స్ పైనే సినిమా సక్సెస్ కూడా ఆధారపడి వుంటుంది. అందువల్లనే క్లైమాక్స్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో కసరత్తు చేస్తారు. అలాంటి క్లైమాక్స్ 'జెంటిల్ మన్' సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. నాని కథానాయకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ లోను కనిపిస్తాడు. అదే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అనుకుంటూ వుంటే, క్లైమాక్స్ కూడా థ్రిల్ కలిగించేలా ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో, సురభి .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)