ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jun 07, 2016
కాజల్
కాజల్
* తాము నటించిన సినిమాలు సక్సెస్ కాకపోతే ఎవరైనా సరే అప్సెట్ అవుతారు. అయితే అందాల కథానాయిక కాజల్ మాత్రం అలాంటి ఫీలింగులో లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె తెలుగులో నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బ్రహ్మోత్సవం' రెండు చిత్రాలూ సక్సెస్ కాలేదు. అయినా కూడా అమ్మడు హ్యాపీగానే వుంది. "సర్దార్'లో పవన్ పక్కన తొలిసారిగా నటించాను, బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రంలో నటించాను. ఆ విధంగా నేను హ్యాపీనే" అంటోంది ఈ ముద్దుగుమ్మ.
* సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ప్రేమకథతో కూడిన సస్పెన్స్ చిత్రంగా రూపొందింది. రాజసింహ తాడినాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథ హైదరాబాదు హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నేపథ్యంలో ఎక్కువ భాగం జరుగుతుందట. ఈ నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
* తమన్నా కథానాయికగా ప్రభుదేవా నిర్మిస్తున్న 'అభినేత్రి' లేడీ ఓరియెంటెడ్ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో పాటలను చిత్రీకరించడానికి చిత్రం యూనిట్ రెడీ అవుతోంది. సుమారు 70 కోట్ల బడ్జెట్టుతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)