ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విశాల్ ప్రేమ పెళ్లే చేసుకుంటాడట!

Mon, Jun 06, 2016
విశాల్
విశాల్
విశాల్ కథానాయకుడిగా వచ్చిన 'రాయుడు' .. ఆయనకి భారీ హిట్ ను కట్టబెట్టింది. ఆ విజయోత్సాహంతో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. అందువల్లనే తెలుగులో నేరుగా ఒక సినిమా చేయనున్నానని అన్నాడు. ఇక ముందు కూడా విలక్షణమైన నటనకు అవకాశం వున్న పాత్రలను చేస్తానని చెప్పాడు.

తనపై నడిగర సంఘం అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన బాధ్యత కూడా వుందని అన్నాడు. నడిగర సంఘం కోసం ఒక ఆధునిక భవన నిర్మాణం .. కల్యాణ మంటపం పూర్తి చేయవలసి వుందని చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 14న కల్యాణ మంటపానికి సంబంధించిన భవనాన్ని ఆరంభించనున్నామనీ, ఆ కల్యాణ మంటపంలో మొదటగా తన పెళ్లే జరుగుతుందని అన్నాడు. తన తల్లిదండ్రులది, అన్నది ప్రేమ వివాహమనీ, తనది కూడా ప్రేమ వివాహమే అవుతుందని చెప్పాడు. విశాల్ మనసు గెలుచుకున్న ఆ అమ్మాయి ఎవరనేది తెలియాలంటే అప్పటివరకూ వేచి ఉండవలసిందే.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)