ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయన్ ఆ మూవీకి ఓకే చెబుతుందా?

Mon, Jun 06, 2016
నయనతార
నయనతార
నయనతార ఇప్పుడు వరుస విజయాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. అలాగే దర్శకుడు అశ్విన్ శరవణన్ కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అశ్విన్ శరవణన్ పేరు వినగానే నయనతారతో ఆయన తెరకెక్కించిన 'మాయ' సినిమా గుర్తుకు వస్తుంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా సాధించిన విజయం గుర్తుకు వస్తుంది.

అలాంటి అశ్విన్ శరవణన్ కథానాయిక ప్రాధాన్యత కలిగిన మరో ఆసక్తికరమైన కథను రెడీ చేశాడట. ఆ కథను ఆయన నయనతారతోనే తెరకెక్కించాలానే ఆలోచనలో వున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా సిద్ధంగా ఉండటంతో, ఆమెని ఒప్పించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడని అంటున్నారు. ప్రస్తుతం సెట్స్ పై వున్న సినిమాలు పూర్తిచేయడానికే నయన సతమతమైపోతోందట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఓకే అంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)