ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ కి విలన్ గా బాలీవుడ్ హీరో?

Sun, Jun 05, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
మహేశ్ బాబుకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా మారనున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో దీనిని ప్లాన్ చేస్తున్నారు.

దీంతో ఈ ప్రాజక్టుకి హిందీలో మరింత క్రేజ్ రావడం కోసం ఇందులోని విలన్ పాత్రను అక్షయ్ తో చేయించడానికి ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్టు తాజా సమాచారం. అక్షయ్ తో దర్శకుడికి మంచి అనుబంధం ఉండడంతో ఆయన ఒప్పుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే 'రోబో' సీక్వెల్ లో అక్షయ్ విలన్ పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)