ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పంజాబీ రీమేక్ పై రానా ఆసక్తి!

Sat, Jun 04, 2016
రానా
రానా
'బాహుబలి' సినిమాతో భారీస్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న రానా, ఇక సోలో హీరోగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ఆలోచనలో వున్నాడు. ఈ కారణంగానే ఆయన వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందులో భాగంగానే 'ఘాజీ' వంటి సినిమాలు చేస్తూ .. తెలుగుతో పాటు ఇతర భాషలలోను విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.

అంతేకాదు ఇతరభాషల్లోని విభిన్నమైన సినిమాలను చూసి .. వాటి రీమేక్ హక్కులు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఆయన పంజాబీ సినిమా 'సర్దార్ జీ 2' రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు రెండు విభిన్నమైన పాత్రల్లో విలక్షణమైన నటనను ప్రదర్శిస్తాడట. నటన పరంగా ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో రీమేక్ హక్కులను తీసుకుని, తానే స్వయంగా నిర్మించాలనే ఉద్దేశంతో రానా ఉన్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)