ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ త్రివిక్రమ్ తోనే చేస్తాడట!

Sat, Jun 04, 2016
త్రివిక్రమ్
త్రివిక్రమ్
త్రివిక్రమ్ సినిమా అనగానే సహజంగానే అన్నివర్గాల వారికి ఆసక్తి ఏర్పడుతుంది. అందరికీ కావలసిన అంశాలను ఆయన సమపాళ్లలో అందించడమే అందుకు కారణం. అందువల్లనే 'అ ఆ' సినిమాతో ఆయన మరో మారు సక్సెస్ ను అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి, తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో త్రివిక్రమ్ తో కలిసి ఆయన జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి .. సినిమాలను కూడా నిర్మించాడు. అలా 'అ ఆ' సినిమాతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తదుపరి సినిమా కూడా త్రివిక్రమ్ తోనే చేస్తానని చెప్పాడు. దాంతో ఆ సినిమా ఎవరితో ఉంటుందా అనే విషయంలో ఆసక్తి నెలకొంది.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)