ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ హీరోపై తల్లి కోప్పడిందట!

Sat, Jun 04, 2016
విశాల్
విశాల్
కోలీవుడ్ అగ్రకథానాయకుల జాబితాలో విశాల్ కూడా కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా అనువాదాలుగా ఇక్కడికి వచ్చిన ఆయన సినిమాలలో కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి. అలాంటివాటి సరసన ఆయన తాజా చిత్రం 'రాయుడు' కూడా నిలిచింది. విశాల్ - శ్రీదివ్య జంటగా నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధిస్తోంది.

ఈ సక్సెస్ విశాల్ తల్లికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. తెలుగులో ఇంతటి భారీ సక్సెస్ వచ్చినా .. స్ట్రైట్ సినిమా చేయకపోవడమేంటని ఆమె ఆయనపై కోప్పడిందట. దాంతో తాను నేరుగా తెలుగు సినిమా చేయనున్నట్టు చెప్పాడు. 'రాయుడు' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హరి .. తనతో తెలుగు సినిమా చేస్తున్నాడనీ, ఈ సినిమాకి సురాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని విశాల్ స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)