ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్లామర్ డోస్ పెంచనున్న రెజీనా

Sat, Jun 04, 2016
రెజీనా
రెజీనా
కొత్త కథానాయికలు పెద్ద సంఖ్యలో తెలుగు తెరకి పరిచయం అవుతున్నా, రెజీనా తన దూకుడు చూపిస్తూ వస్తూనే వుంది. ఒక వైపున నటనకి అవకాశం కలిగిన పాత్రలు చేయడానికి ప్రాధన్యతనిస్తూనే, మరో వైపున పోటీని తట్టుకోవడానికిగాను గ్లామర్ డోస్ పెంచడానికి కూడా ఆమె వెనుకాడటం లేదనే టాక్ వినిపిస్తోంది. కృష్ణవంశీ సినిమా నుంచే ఆమె గ్లామర్ డోస్ పెంచనుందనే వార్త షికారు చేస్తోంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో నాయికగా రెజీనాను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఓ మాదిరిగా అందాలను ఆరబోసిన రెజీనా, ఈ సినిమా నుంచి డోస్ పెంచనుందట. అసలే కృష్ణవంశీకి కథానాయికలను గ్లామర్ గా చూపించడంలో సిద్ధ హస్తుడు అనే పేరుంది. మరి ఇక రెజీనాను ఆయన ఏ రేంజ్ లో చూపిస్తాడో!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)