ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్!

Sat, Jun 04, 2016
రకుల్
రకుల్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకోనున్నట్టు వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఆ ఛాన్స్ రకుల్ కి దక్కినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రుతిహాసన్ 'శభాష్ నాయుడు' సినిమా షూటింగులో బిజీగా వుంది. ఈ సినిమా కోసం ఆమె 60 రోజుల పాటు డేట్స్ ఇచ్చేసింది. అందువలన ఆమె పవన్ కల్యాణ్ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. దాంతో ఈ సినిమా టీమ్ తెలుగులో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ను ఎంపిక చేసినట్టు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే రకుల్ అదృష్టవంతురాలే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్ .. అల్లు అర్జున్ తో నటించిన ఆమె, మరో వైపున సాయిధరమ్ తేజ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి .. తాజాగా పవన్ జోడీగా ఛాన్స్ కొట్టడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)