ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పారితోషికం తీసుకోని యంగ్ హీరో!

Fri, Jun 03, 2016
సందీప్ కిషన్
సందీప్ కిషన్
సాధారణంగా కథానాయకులైనా .. కథానాయికలైనా తమకి గల క్రేజ్ ను బట్టి, పారితోషికాన్ని తీసుకుంటూ వుంటారు. అయితే తమకి ఎంతో ఇష్టమైన పాత్రను పోషించే అవకాశం వచ్చినప్పుడు, తమ పారితోషికం విషయాన్ని కూడా పక్కకి పెట్టేస్తుంటారు. ఆ పాత్రను పోషించి సంతోష పడుతుంటారు .. సంతృప్తి చెందుతుంటారు. ప్రస్తుతం సందీప్ కిషన్ అదే చేస్తున్నాడు. నిత్యామీనన్ తో కలిసి సందీప్ కిషన్ చేసిన తాజా చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ, ఈ సినిమా కథ చాలాకాలం క్రితమే సందీప్ కిషన్ కి చెప్పానని అన్నాడు. అప్పటి నుంచి ఈ సినిమాను పూర్తిచేసేంత వరకూ ఆయన ఎంతో ఆరాట పడ్డాడని చెప్పాడు. లాభాలు వస్తే తీసుకుంటానని చెప్పి, ముందుగా పారితోషికం కూడా తీసుకోకుండా ఆయన పనిచేశాడంటూ అభినందించాడు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)