ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళం నేర్చుకుంటోన్న హీరోయిన్

Fri, Jun 03, 2016
అదితీరావు
అదితీరావు
ఇటీవల కథానాయికలు తమకి ఏ భాషలో అవకాశం వస్తే ఆ భాషను నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అవకాశం ఇస్తే తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కథానాయిక అదితీరావు కూడా ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో పడింది. కార్తీ కథానాయకుడిగా తెలుగు .. తమిళ భాషల్లో మణిరత్నం ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన ఆయన, అదితీరావును ఫైనల్ చేశారు. అయితే అదితీరావుకు అంతగా తమిళం రాదు. భాషపై పట్టు లేనప్పుడు భావ ప్రకటన కష్టమవుతుంది. ఇదే విషయాన్ని ఆమెతో మణిరత్నం చెప్పారట. ఎందుకంటే సహజంగానే మణిరత్నం సినిమాలలో సున్నితమైన భావాల ఆవిష్కరణ వుంటుంది. దాంతో తమిళ భాషను నేర్చుకునే పనిలో ఆమె నిమగ్నమై వుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)