ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరింత గ్లామరస్ గా ఎమీ జాక్సన్!

Fri, Jun 03, 2016
ఎమీ జాక్సన్
ఎమీ జాక్సన్
శంకర్ సినిమాలలో వరుస ఛాన్సులు కొట్టేస్తూ ఎమీ జాక్సన్ అగ్రకథానాయికగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం పోటీలుపడుతోన్న దర్శక నిర్మాతలు చాలా మందే వున్నారు. ఆమె తాజా చిత్రం 'రోబో 2.0' షూటింగు దశలో వుంది. అయితే ఈ సినిమాలో ఆమె లేడీ రోబో లా కనిపిస్తుందనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. దాంతో ఈ సుందరి అందాల విందు చేసే అవకాశం లేదనుకుని అభిమానులు నిరాశ చెందారు.

అలాంటి ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఎమీ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తాను ఈ సినిమాలో 'రోబో'గా కనిపిస్తాననే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదనీ, తాను రజనీకాంత్ ప్రియురాలి పాత్రలో నటిస్తున్నానని అంది. ఈ సినిమాలో తనని శంకర్ మరింత అందంగా చూపిస్తున్నాడని చెప్పుకొచ్చింది. కాబట్టి ఈ సినిమాలోనూ ఎమీ అందాల విందు ఓ రేంజ్ లో ఉంటుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)