ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కోడి రామకృష్ణ మరో ప్రయోగం!

Wed, Jun 01, 2016
విష్ణువర్ధన్
విష్ణువర్ధన్
తెలుగులో కథా బలమున్న ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా కోడి రామకృష్ణకి ఎంతో పేరుంది. అలాగే అమ్మోరు .. అంజి .. అరుంధతి వంటి గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా కూడా ఆయన ఔరా! అనిపించుకున్నారు. అలాంటి కోడి రామకృష్ణ కన్నడలో ఒక భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

గతంలో విష్ణువర్ధన్ కథానాయకుడిగా నటించిన 'నాగ రాహువు' సినిమాను ఆయన రీమేక్ చేస్తున్నారు .. అదీ విష్ణువర్ధన్ తోనే కావడం విశేషం. కన్నడ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన విష్ణువర్ధన్, కొంతకాలం క్రితం చనిపోయారు. గ్రాఫిక్స్ సాయంతో ఆయనే హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందు కోసం వందల సంఖ్యలో గ్రాఫిక్స్ నిపుణులు పనిచేస్తున్నట్టు సమాచారం. చనిపోయిన హీరోపై ఇలా పూర్తి గ్రాఫిక్స్ తో పూర్తిస్థాయి చిత్రం తెరకెక్కడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)