ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ రీమేక్ పై రవితేజ దృష్టి!

Wed, Jun 01, 2016
రవితేజ
రవితేజ
రవితేజ గతేడాది నటించిన 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు కొత్త సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ సినిమాపై మనవాడు మనసు పారేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన 'జాలీ ఎల్.ఎల్.బి' చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో రవితేజ ఉన్నాడట. అర్షద్ వర్శి, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో సుభాష్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హిందీ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఈ కథ, ఇందులోని లాయర్ పాత్ర తన శైలికి బాగా సూటవుతాయని రవితేజ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఈ హీరో దీనిపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)