ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ మూవీలో అనుష్క లేనట్టేనా?

Tue, May 31, 2016
అనుష్క
అనుష్క
చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయం తేలలేదు. మొదట్లో నయనతార నటించే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు షికారు చేశాయి. వరుస సినిమాలతో బిజీగా వున్న నయనతార, అలాంటిదేం లేదని చెప్పేసింది. దాంతో అందరి దృష్టి అనుష్క పై పడింది.

ఈ సినిమా టీమ్ ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు కూడా బయటికి వచ్చాయి. దాదాపు ఆమె ఎంపిక ఖరారు కావొచ్చనే అంతా అనుకున్నారు. అయితే తాను ఈ సినిమాకి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని అనుష్క చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క చేతిలో బాహుబలి 2 .. సింగం 3 .. భాగమతి సినిమాలు వున్నాయి. వీటిలో రెండు సెట్స్ పై వుండగా, మూడవ సినిమా త్వరలో మొదలు కాబోతోంది. మరి చిరూ జోడీ కట్టే కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)