ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శింబూ నయన్ ల జోడీ అదుర్స్!

Mon, May 30, 2016
నయనతార
నయనతార
శింబూ .. నయనతార జోడీ అదిరిపోయిందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇదు నమ్మ ఆళు' సినిమా చూసిన అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజుల్లో మొత్తంగా ఈ సినిమా 14 కోట్లను రాబట్టినట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరి కెరియర్లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు.

చాలాకాలం తరువాత శింబూ .. నయనతార కలిసి నటించడం, ఈ సినిమా కథలో కొంత భాగం వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారానికి దగ్గరగా ఉండటం వసూళ్లపై ప్రభావం చూపించిందని అనుకుంటున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి శింబూ హిట్ కొట్టినందుకు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)