ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిన్న సినిమా చేసే ఆలోచనలో గుణశేఖర్?

Mon, May 30, 2016
గుణశేఖర్
గుణశేఖర్
చిన్నపిల్లలతో 'రామాయణం' తెరకెక్కించి పౌరాణిక చిత్రాన్ని తాను ఎంత అద్భుతంగా ఆవిష్కరించగలననేది దర్శకుడు గుణశేఖర్ నిరూపించాడు. అలాగే 'రుద్రమదేవి' ద్వారా చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించడంలోను ఆయన తన సత్తా చాటుకున్నాడు. అలాంటి గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' టైటిల్ ను కూడా రిజిష్టర్ చేయించాడు. ఆయన నుంచి ఈ సినిమా వస్తుందని అంతా అనుకుంటున్నారు.

అయితే దానికన్నా ముందుగా ఆయన ఒక చిన్న సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ప్రతాపరుద్రుడు' కూడా భారీ బడ్జెట్ తోను .. భారీ తారాగణంతోను .. అంతకి మించిన శ్రమతోను కూడుకుని ఉన్నదే. పైగా ఆయన అనుకున్న ఆర్టిస్టుల డేట్స్ దొరకడానికి కొంత సమయం పట్టేలా వుందట. అందువలన ఈలోగా ఒక చిన్న సినిమా చేసే ఉద్దేశంతో ఉన్నాడని చెబుతున్నారు. దీనిపై స్పష్టమైన సమాచారం రావలసి వుంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)