ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' రోజునే 'ప్రేమమ్'?

Sat, May 28, 2016
నాగచైతన్య
నాగచైతన్య
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగు దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఇదే రోజున 'ప్రేమమ్' సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఈ ప్రేమకథాంశం మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో తెలుగులోను ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. దీనిని ఆగస్టు 12న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నారని చెప్పుకుంటున్నారు. ఇంకా ఈ తేదీన ఏయే సినిమాలు రంగంలోకి దిగుతాయో చూడాలి .
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)