ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విశాల్ జోడీగా తమన్నా

Sat, May 28, 2016
తమన్నా
తమన్నా
తెలుగుతో పాటు తమిళంలోను దూసుకుపోవడానికి తమన్నా తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. విశాల్ చేసిన 'రాయుడు' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన జి.హరి, ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెప్పాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు నటిస్తారనీ, మరో విలన్ గా తరుణ్ అరోరా నటిస్తాడని అన్నాడు. జూన్ 9 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ఆరంభించాలని అనుకుంటున్నామనీ, హైదరాబాద్ లో నెల రోజుల పాటు షూటింగ్ జరుపుతామని చెప్పాడు. ఆ తరువాత షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశామని అన్నారు. కొంత భాగాన్ని ఫారిన్ లోను చిత్రీకరించనున్నామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)