ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రిలీజ్ డేట్ చెప్పిన చైతూ డైరెక్టర్

Sat, May 28, 2016
నాగచైతన్య
నాగచైతన్య
నాగచైతన్య కథానాయకుడిగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలకి ముస్తాబు అవుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవల రెండు పాటలను వదలడంతో, మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆడియో వేడుకను జూన్ 17న జరపనున్నారనీ, జూలై 15న సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ తేదీలను ఖరారు చేస్తున్నట్టుగా దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పారు.

ఇటీవల వదిలిన రెండు పాటలకు తాను ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని ఆయన అన్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ అందించిన బాణీలకు తన మాదిరిగానే ఆడియన్స్ స్పందించడం అందుకు కారణమని చెప్పారు. సినిమా కూడా తాను అనుకున్నట్టుగానే ఘన విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా మంజిమామోహన్ అలరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)