ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీ హీరోగా చేసేది అప్పుడేనా?

Fri, May 27, 2016
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుందనీ, దిల్ రాజు నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుందని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. త్వరలోనే తన సినిమా ఉంటుందని దేవిశ్రీ కూడా చెప్పాడు. కానీ ఇంతవరకూ ఆ సినిమాకి సంబంధించిన కదలికలు ఎక్కడా కనిపించడం లేదు. బాలకృష్ణ 100వ సినిమాకి .. చిరంజీవి 150వ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందించనున్నాడు.

అలాగే సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసే సినిమాకి కూడా ఆయనే సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇక దిల్ రాజు యువ కథానాయకులతో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ ముగ్గురు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేయనున్న మూవీ సంగతి ఏంటనే సందేహం అభిమానులకు కలుగుతోంది. చిరంజీవి .. బాలకృష్ణ సినిమాలు ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకున్నవి గనుక, ముందుగా ఈ సినిమాల వర్క్ ను పూర్తి చేసే పనిలో దేవిశ్రీ వున్నాడు. చరణ్ తో సుకుమార్ సినిమా అయ్యాక .. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆయనతో కలిసి దేవిశ్రీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)