ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భాగ్యలక్ష్మిగా అలరించనున్న శ్రీదివ్య!

Thu, May 26, 2016
శ్రీదివ్య
శ్రీదివ్య
శ్రీదివ్య .. తెలుగుదనం ఉట్టిపడే రూపం. తెలుగు అమ్మాయే అయినా తమిళంలోనే ఆమెకి అవకాశాలు .. అభిమానులు ఎక్కువ. అలాంటి శ్రీదివ్య నటించిన 'రాయుడు' సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్రపేరు భాగ్యలక్ష్మి అని చెప్పింది. తన పాత్ర చాలా బోల్డ్ గా .. పవర్ఫుల్ గా ఉంటుందని అంది.

దర్శకుడు తన పాత్రను ఎంతో చక్కగా మలిచాడనీ, ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుందని చెప్పింది. మొదటిసారి కావడంతో విశాల్ సరసన నటించడానికి చాలా భయపడ్డాననీ, ఆయన సరదాగా మసలుకోవడంతో భయం పోయిందని చెప్పింది. తాను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతున్న కారణంగా, తెలుగు ప్రేక్షకులకి దూరమయ్యాననే ఫీలింగ్ కలగడం లేదని అంది. మంచి పాత్రలు వస్తే తెలుగులో చేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)