ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ట్రైనింగ్ తీసుకుంటున్న ఆదా శర్మ!

Thu, May 26, 2016
శిక్షణలో భాగంగా ఆదా శర్మ
శిక్షణలో భాగంగా ఆదా శర్మ
ఇటీవల కాలంలో కథానాయికలు కేవలం అందాలు ఆరబోసే పాత్రలు కాకుండా, నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. విభిన్నమైన పాత్రలను పోషించి తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాత్రకి తగిన శిక్షణ తీసుకోవడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఆదా శర్మ అలాంటి ఉత్సాహంతోనే శిక్షణ తీసుకుంటోంది.

తెలుగులో కథానాయికగా మరింత క్రేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఆమె, హిందీలో 'కమెండో 2' సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె స్టంట్స్ చేయవలసి ఉంటుందట. అందువలన అందుకు తగిన కఠిన శిక్షణను తీసుకుంటున్నట్టుగా ఆమె తెలియజేస్తూ .. అందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. పాటల్లో అలరించే ఈ సుందరి .. ఇక ఫైట్లతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)