ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒక మనసు' రిలీజ్ డేట్ ఖరారు

Thu, May 26, 2016
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
బుల్లితెరపై చాలా తక్కువ సమయంలో నిహారిక ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే 'ఒక మనసు' సినిమాతో ఆమె కథానాయికగా మారింది. ఈ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ఆమె అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఇక మెగా హీరోల సమక్షంలో విడుదలైన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిహారిక ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తోంది. ఒక ప్రేమకథలో ఉండవలసిన ఫీల్ ఈ సినిమాలో ఉందనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోయింది. దాంతో వాళ్లంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూన్ 24న విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. ఇది తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే ఆశాభావాన్ని వాళ్లు వ్యక్తం చేశారు. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య జోడీగా నిహారిక నటించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)