ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించిన కార్తీ!

Wed, May 25, 2016
కోలీవుడ్ అగ్రకథానాయకులలో కార్తీ ఒకరు. మొదటి నుంచి ఆయన వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ .. తన సత్తా చాటుతూ వస్తున్నాడు. అలాంటి కార్తీ పుట్టినరోజు .. ఈరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానంటూ ట్విట్టర్ కి వచ్చేశాడు. తనని ఎంతగానో అభిమానిస్తోన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.

తమ అభిమాన కథానాయకుడు ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు కార్తీ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. కార్తీకి తమిళంతో పాటు తెలుగులోను అభిమానులు వున్నారు. ఈ మధ్య వచ్చిన 'ఊపిరి' సినిమా, ఈ రెండు భాషల్లోను ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చి పెట్టింది. తాజాగా ఆయన తమిళంలో చేస్తోన్న ' కాష్మోరా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో కార్తీ ఉన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)