ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరో జోడీగా కొత్త హీరోయిన్!

Wed, May 25, 2016
అష్నా జవేరి
అష్నా జవేరి
తెలుగు తెరకి కొత్త కథానాయికల జోరు మరింతగా పెరుగుతోంది. ఈ క్రమంలో మరో కథానాయిక తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ సినిమా పేరు 'బుర్రకథ' అయితే .. ఆ కథానాయిక పేరు 'అష్నా జవేరి'. నవీన్ చంద్ర కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ చంద్ర అనగానే అందాల రాక్షసి .. త్రిపుర .. లచ్చిందేవికి ఓ లెక్కుంది వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి.

హీరోగా తనకి సరైన హిట్ పడే సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'బుర్రకథను' అంగీకరించాడు. కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, చివరిగా అష్నా జవేరిని ఓకే చేశారు. కోలీవుడ్ లో సంతానంతో కలిసి ఓ రెండు సినిమాలల్లో ఆమె నటించింది. కథాపరంగా ఈ సినిమాకి ఆమె అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కథానాయికగా తీసుకున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలోని ఒక పాటలో సన్నీలియోన్ మెరవనుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)