ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార మూవీ వచ్చేస్తోంది

Wed, May 25, 2016
నయనతార
నయనతార
కోలీవుడ్ లో వరుస విజయాలను అందుకుంటూ నయనతార తన హవాను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజా చిత్రం 'ఇదు నమ్మ ఆళు' విడుదలకి రెడీ అయింది. శింబు సరసన నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శింబు - నయనతార ప్రేమించుకుని .. పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటారట. అలా పెళ్లి చేసుకున్న ఈ జంటను విడదీయడానికి రకరకాల ప్రయత్నాలు చేసే పాత్రలో తాప్సీ కనిపించనుంది.

గతంలో శింబు - నయనతార ప్రేమించుకున్నారు .. పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. ఆ తరువాత మనస్పర్థలు తలెత్తడం వలన విడిపోయారు. వీరి ప్రేమ వ్యవహారం అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా తెరపైకి వస్తూనే ఉంటుంది. అలాంటి ఈ జంట .. అదే తరహా నేపథ్యంతో కూడిన సినిమా చేయడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతోనైనా శింబూకి హిట్ దక్కుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)