ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్

Tue, May 24, 2016
ఐశ్వర్య అర్జున్
ఐశ్వర్య అర్జున్
ఒకనాటి అగ్రకథానాయకుల కూతుర్లు కథానాయికలుగా రంగంలోకి దిగుతున్నారు. కొంతమంది సక్సెస్ లను అందుకుంటూ వుంటే, మరికొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటివారి జాబితాలో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కనిపిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ కింగ్ గా అర్జున్ ఒక వెలుగు వెలిగారు. దర్శకుడిగాను ఆయన తన మార్క్ చూపించడంలో సక్సెస్ అయ్యారు.

అలాంటి అర్జున్ కథానాయికగా తన కూతురు ఐశ్వర్యను ప్రోత్సహించారు. అంతేకాదు ఆమె కెరియర్ స్పీడ్ అందుకునేలా చేయడానికిగాను తానే దర్శకనిర్మాతగా మరోసారి రంగంలోకి దిగారు. 'కాదలిన్ పొన్ వీథియిల్' అనే ప్రేమ కథాంశాన్ని ఆయన ఎంచుకున్నారు. చందన్ .. ఐశ్వర్య జంటగా నటించే ఈ సినిమా, ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందే ఈ కథ, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో అర్జున్ ఉన్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)