ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలో 'అభినేత్రి' ఫస్టులుక్

Mon, May 23, 2016
తమన్నా
తమన్నా
అనుష్క .. త్రిష .. నయనతార మాదిరిగా తమన్నా కూడా కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె 'అభినేత్రి' అనే సినిమాను అంగీకరించింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి జూన్ 3న ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న కోన వెంకట్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు.

ప్రభుదేవా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, మరో ప్రధానమైన పాత్రలో సోను సూద్ కనిపించనున్నాడు. ఈ మధ్యనే ప్రభుదేవాకి సంబంధించిన ఒక సాంగ్ ను చిత్రీకరించారు. ఆ సాంగ్ వీడియోలో కొంత భాగాన్ని కూడా జూన్ 3న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మొదటిసారిగా హారర్ థ్రిల్లర్ లో నటిస్తోన్న తమన్నా, సీనియర్ కథానాయికల మాదిరిగానే సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)