ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శ్రీరస్తు శుభమస్తు'కి రీ-షూట్?

Sat, May 21, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
తెలుగు తెరపై యువ కథానాయకులతో పోటీపడటానికి అల్లు శిరీష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. యూత్ కి సంబంధించిన కథల పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చిన ఆయన, ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవడం కోసం 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా చేశాడు. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో, శిరీష్ జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అనుకుంటున్నారు. అయితే కాస్త ఆలస్యం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం కొన్ని సీన్స్ ను రీషూట్ పెట్టాలనే ఆలోచనే అని అంటున్నారు. కొన్ని సీన్స్ మరింత బాగా రావాలని అల్లు అరవింద్ అభిప్రాయపడినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే అలాంటిదేం లేదనేది యూనిట్ వర్గాల మాట. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. అల్లు శిరీష్ మాత్రం ఈ సినిమా తన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)