ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జాగ్వార్' లో జగపతిబాబు

Sat, May 21, 2016
జగపతిబాబు
జగపతిబాబు
జగపతిబాబు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. విలన్ పాత్రలను .. కీలకమైన పాత్రలను చేస్తూ ఆయన దూసుకుపోతున్నారు. తెలుగులోనే కాదు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళుతున్నారు. జగపతిబాబు చేసిన సినిమాలు విజయాలను అందుకుంటూ ఉండటం .. ఆయన పాత్రలకి మంచి మార్కులు పడుతుండటం వలన వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. వాటిలో కొత్తదనం కలిగిన పాత్రలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు.

అలా ఆయన 'జాగ్వార్' అనే కన్నడ సినిమా చేస్తున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడైన నిఖిల్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయమని కోరడంతో .. అది తనకి నచ్చడంతో చేస్తున్నానని జగపతిబాబు చెప్పారు. షూటింగు స్పాట్లో కుమారస్వామి ఆత్మీయంగా వ్యవహరించడం తనకి చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఇక నిఖిల్ విషయానికి వస్తే, అతని అంకితభావం తనకి బాగా నచ్చిందని చెప్పారు. ఈ సినిమా హిట్ కేటగిరీలో చేరితే, అక్కడ కూడా జగపతిబాబు ఒక రేంజ్ లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)