ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీప్రసన్నతో మొదలైన 'లక్ష్మీ బాంబ్'

Fri, May 20, 2016
లక్ష్మీప్రసన్న
లక్ష్మీప్రసన్న
వివిధ పాత్రలను పోషిస్తూ విలక్షణమైన నటిగా లక్ష్మీప్రసన్న గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా ఆమె 'లక్ష్మీ బాంబ్' అనే సినిమాను కూడా ఓకే చేసింది. ఈ సినిమాను ఈరోజు ఉదయం లాంచ్ చేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. లక్ష్మీ ప్రసన్న పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి విష్ణు క్లాప్ కొట్టగా, మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశాడు.

ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ, ఇంతవరకూ తాను పోషించిన పాత్రలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. దర్శకుడు గోపాలకృష్ణ చెప్పిన కథ వినగానే వెంటనే తాను ఓకే చెప్పానని అంది. ఈ సినిమాలో తాను జడ్జి పాత్రలో కనిపిస్తాననీ, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని చెప్పింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచి జరగనుందనీ, షూటింగ్ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)