ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సీతామహాలక్ష్మి'తో మంచు మనోజ్!

Fri, May 20, 2016
మనోజ్
మనోజ్
చూస్తుంటే మంచు మనోజ్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా సినిమాలను అంగీకరిస్తూ వెళుతుండటమే అందుకు కారణం. మొదటి నుంచి యాక్షన్ హీరోగా ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిన మనోజ్, కొంతకాలంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే దిశగా కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు.

అలా ఆయన సాగర్ ప్రసన్న డైరెక్షన్లో 'సీతామహాలక్ష్మీ' అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి 'మద్రాస్ ర్యాంబో' అనేది ఉపశీర్షిక. ఈ సినిమా తరువాత కూడా మనోజ్ మరో రెండు సినిమాలను అంగీకరించాడు. ఒక సినిమాకి కె.సత్య దర్శకుడిగా వ్యవహరించనుండగా, మరో సినిమాకి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా సెట్స్ పైకి వెళ్లనున్నాయి. 'సీతామహాలక్ష్మీ' టైటిల్ .. 'మద్రాస్ ర్యాంబో' ట్యాగ్ లైన్ ఒకదానికొకటి భిన్నంగా ఉండటం వలన అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)